Practice the AP 6th Class Maths Bits with Answers 12th Lesson దత్తాంశ నిర్వహణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Maths Bits 12th Lesson దత్తాంశ నిర్వహణ
ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.
ప్రశ్న1.
 పౌనఃపున్య విభాజన పట్టికలోని దత్తాంశాన్ని దృశ్య రూపంలో చూపడానికి క్రింది ఏ రేఖా చిత్రాలలో బొమ్మలను ఉపయోగిస్తారు ?
 A) పట చిత్రాలు
 B) నిలువు కమ్మీరేఖా చిత్రాలు
 C) అడ్డు కమ్మీ రేఖాచిత్రాలు
 D) వలయ చిత్రాలు
 జవాబు :
 A) పట చిత్రాలు
ప్రశ్న2.
 కమ్మీ రేఖాచిత్రంలోని కమ్మీల ఆకారం
 A) త్రిభుజం
 B) దీర్ఘచతురస్రం
 C) వృత్తము
 D) పైవి అన్ని
 జవాబు :
 B) దీర్ఘచతురస్రం
ప్రశ్న3.
 కమ్మీ రేఖా చిత్రానికి సంబంధించి క్రింది ఏది సత్యం?
 X: కమ్మీ రేఖాచిత్రంలోని అన్ని కమ్మీల పొడవులు సమానం.
 Y : కమ్మీ రేఖాచిత్రంలోని అన్ని కమ్మీల వెడల్పులు సమానం.
 A) X, Y లు రెండూ సత్యం
 B) X – అసత్యం, Y – సత్యం
 C) X – సత్యం, Y- అసత్యం
 D) X, Y లు రెండూ అసత్యం
 జవాబు :
 B) X – అసత్యం, Y – సత్యం
ప్రశ్న4.
 కమ్మీ రేఖా చిత్రంలోని కమ్మీ పొడవు క్రింది దేనిపై ఆధారపడి ఉంటుంది ?
 A) దత్తాంశంలోని అంశాల సంఖ్య
 B) కమ్మీ వెడల్పు
 C) అంశం యొక్క పౌనఃపున్యము
 D) పైవి అన్ని
 జవాబు :
 C) అంశం యొక్క పౌనఃపున్యము
ప్రశ్న5.
 క్రింది వానిలో ఏది సత్యం ?
 A) గ్రాఫ్ కాగితంపై క్షితిజాక్షాన్ని Y- అక్షం అంటారు.
 B) గ్రాఫ్ కాగితంపై లంబాక్షాన్ని X- అక్షం అంటారు.
 C) కమ్మీ రేఖాచిత్రంలోని అన్ని కమ్మీల వెడల్పులు సమానం
 D) పైవి అన్ని,
 జవాబు :
 C) కమ్మీ రేఖాచిత్రంలోని అన్ని కమ్మీల వెడల్పులు సమానం

ప్రశ్న6.
 ప్రవచనం-P : కమ్మీరేఖా చిత్రంలోని కమ్మీ పొడవు ఆ కమ్మీ సూచించే అంశం యొక్క పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
 ప్రవచనం-Q : కమ్మీ రేఖా చిత్రంలోని కమ్మీల వెడల్పు ఆ కమ్మీ సూచించే అంశం యొక్క పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.
 A) P, Qలు రెండూ సత్యం
 B) P, Qలు రెండూ అసత్యం
 C) P అసత్యం, Q సత్యం
 D) P సత్యం, Q అసత్యం
 జవాబు :
 D) P సత్యం, Q అసత్యం
ప్రశ్న7.
 ఒక దత్తాంశంలో ఒక అంశం యొక్క పౌనఃపున్యము 50. స్కేలు 1 సెం.మీ. = 10 అయిన కమ్మీ రేఖా చిత్రంలో ఆ అంశాన్ని సూచించు కమ్మీ పొడవు
 A) 5 సెం.మీ.
 B) 10 సెం.మీ.
 C) 50 సెం.మీ.
 D) 1 సెం.మీ.
 జవాబు :
 A) 5 సెం.మీ.
→ ఒక పాఠశాలలోని వివిధ తరగతులలోని విద్యార్థుల సంఖ్య క్రింది విధంగా కలదు. ఈ దత్తాంశాన్ని పరిశీలించి, 8-12 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
ప్రశ్న8.
 ఏ తరగతిలో అత్యధిక విద్యార్థులు కలరు ?
 A) VI
 B) VIII
 C) IX
 D) X
 జవాబు :
 C) IX
ప్రశ్న9.
 పై సమాచారాన్ని కమ్మీరేఖాచిత్రంలో సూచించుటకు స్కేలు 1 సెం.మీ. = 10 మంది విద్యార్థులు అయితే VIII వ తరగతిని సూచించు కమ్మీ పొడవు
 A) 5 సెం.మీ.
 B) 6.5 సెం.మీ.
 C) 8.5 సెం.మీ.
 D) 8 సెం.మీ.
 జవాబు :
 B) 6.5 సెం.మీ.
ప్రశ్న10.
 పై సమాచారాన్ని పట చిత్రంలో చూపడానికి సి= 5 మంది విద్యార్థులైన VII వ తరగతిని సూచించుటకు ఎన్ని బొమ్మలు గీయాలి ?
 A) 18
 B) 19
 C) 13
 D) 12
 జవాబు :
 D) 12
ప్రశ్న11.
 పై సమాచారాన్ని సూచించు కమ్మీ రేఖాచిత్రంలో అత్యంత పొడవైన కమ్మని కలిగి ఉండు తరగతి
 A) IX
 B) VI
 C)X
 D) VIII
 జవాబు :
 A) IX
ప్రశ్న12.
 పై సమాచారాన్ని సూచించు కమ్మీ రేఖా చిత్రంలో కమ్మీల సంఖ్య.
 A) 6
 B) 5
 C) 3
 D) 8
 జవాబు :
 B) 5
క్రింది ఖాళీలను పూరించండి.
ప్రశ్న1.
 ఒక నిర్ణయం తీసుకొనుటకు సహాయపడు సంఖ్యాత్మక లేక వివరణాత్మక సమాచారాన్ని _____________ అంటారు.
 జవాబు :
 దత్తాంశము
ప్రశ్న2.
 భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఖ్యాతి గాంచిన గణితవేత్త _____________
 జవాబు :
 మహలనోబిస్
ప్రశ్న3.
 గ్రాఫ్ కాగితంపై ఉండే క్షితిజాక్షంను _____________ అంటారు.
 జవాబు :
 X – అక్షం

ప్రశ్న4.
 గ్రాఫ్ కాగితంపై ఉండే. లంబాక్షాన్ని _____________ అంటారు.
 జవాబు :
 Y – అక్షం
ప్రశ్న5.
 ఒక అంశం యొక్క పౌనఃపున్యము 35 అయితే స్కేలు ఒక బొమ్మ 5 అంశాలను సూచించును. అయితే పటచిత్రంలో ఆ అంశానికి గీయవలసిన బొమ్మల సంఖ్య _____________
 జవాబు :
 7
ప్రశ్న6.
 పై 5వ సమస్యలోని అంశాన్ని దిమ్మి చిత్రంలో చూపడానికి స్కేలు 1 సెం.మీ. = 5 అంశాలు తీసుకొంటే ఆ అంశాన్ని సూచించు దిమ్మి పొడవు _____________ సెం.మీ.
 జవాబు :
 7 సెం.మీ.
ప్రశ్న7.
 దత్తాంశంలోని అంశాలను, వాటి పౌనఃపున్యాలను సూచించు పట్టికను _____________ అంటారు.
 జవాబు :
 పౌనఃపున్య విభాజన పట్టిక
