SCERT AP 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 5th Lesson నిరూపక జ్యామితి Exercise 5.2

ప్రశ్న 1.
నిరూపకతలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి.
i) (-2, 3)
ii) (5, -3)
iii) (4, 2)
iv) (-7, -6)
v) (0, 8)
vi) (3, 0)
vii) (-4, 0)
viii) (0, -6)
సాధన.
i) (-2, 3) : Q2 (రెండవ పాదము)
ii) (5, -3) : Q4 (నాలుగవ పాదము)
iii) (4, 2) : Q1 (మొదటి పాదము)
iv) (-7, -6) : Q3 (మూడవ పాదము)
v) (0, 8) : Y – అక్షంపై ఉండును.
vi) (3, 0) : X – అక్షంపై ఉండును.
vii) (-4, 0) : X – అక్షంపై ఉండును.
viii) (0, -6) : Y – అక్షంపై ఉండును.

ప్రశ్న 2.
కింది బిందువుల x నిరూపకం మరియు y నిరూపకాలు రాయండి.
i) (4, – 8)
ii) (-5, 3)
iii) (0, 0)
iv) (5, 0)
v) (0, -8)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2 1

AP Board 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2

ప్రశ్న 3.
కింద ఇచ్చిన బిందువులలో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షంపై ఉంటాయి ?
i) (-5, -8)
ii) (0, 13)
iii) (4, -2)
iv) (-2, 0)
v) (0, -8)
vi) (7, 0)
vii) (0, 0)
సాధన.
బిందువులు (0, 13), (0, -8) లు Y – అక్షంపై ఉంటాయి.
బిందువులు (-2, 0), (7, 0) లు X – అక్షంపై ఉంటాయి.
బిందువు (0, 0) X మరియు Y – అక్షాలపై ఉమ్మడిగా ఉంటుంది.
బిందువులు (-5, -8), (4, -2) లు ఏ అక్షంపై ఉండవు.

ప్రశ్న 4.
కింది సటము ఉపయోగించి కింది వానిని కనుగొనండి.
i) L యొక్క y నిరూపకం
ii) Q యొక్కy నిరూపకం
iii) (-2, -2) ను సూచించే బిందువు
iv) (5, -4)ను సూచించే బిందువు
v) N బిందువు యొక్క x నిరూపకం
vi) M బిందువు యొక్క x నిరూపకం
AP Board 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2 2
సాధన.
i) L యొక్క y – నిరూపకం – 7.
ii) Q యొక్క y – నిరూపకం 7.
iii) బిందువు ‘R’ (-2, -2) ను సూచించును.
iv) బిందువు ‘P’ (5, -4) ను సూచించును.
v) N బిందువు యొక్క x – నిరూపకము 4.
vi) M బిందువు యొక్క x – నిరూపకము -3.

ప్రశ్న 5.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి.
i) నిరూపకతలంలో క్షితిజసమాంతరరేఖను Y – అక్షం అని అంటారు.
ii) నిరూపకతలంలో నిలువుగా ఉన్న రేఖను Y – అక్షం అని అంటారు.
iii) రెండు అక్షాలపై ఉన్న బిందువు మూలబిందువు.
iv)(2, -3) బిందువు మూడవ పాదంలో ఉంటుంది.
v) (-5, -3) బిందువు నాలుగవ పాదంలో ఉంటుంది.
vi) x < 0, y < 0 అయితే (-x, – y) అనే బిందువు ఒకటవ పాదంలో ఉంటుంది.
సాధన.
i) అసత్యము
సరియైన వాక్యము : నిరూపక తలంలో క్షితిజ సమాంతర రేఖను X – అక్షం అని అంటారు.
ii) సత్యము
iii) సత్యము
iv) అసత్యము
సరియైన వాక్యము : (2, -3) బిందువు నాల్గవ పాదంలో ఉంటుంది.
v) అసత్యము
సరియైన వాక్యము : (-5, -8) బిందువు మూడవ పాదంలో ఉంటుంది.
vi) సత్యము

AP Board 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2

ప్రశ్న 6.
కింద ఇచ్చిన క్రమయుగ్మాలను గ్రాఫ్ కాగితంపై గుర్తించి మీ పరిశీలనలు రాయండి.
i) (1, 0), (3, 0), (-2, 0), (-5, 0), (0, 0), (5, 0), (-6, 0)
ii) (0, 1), (0, 3), (0, -2), (0, -5), (0, 0), (0, 5), (0, -6)
సాధన.
i) అన్ని బిందువులు X – అక్షంపై వున్నవి.
ii) అన్ని బిందువులు Y – అక్షంపై వున్నవి.
AP Board 9th Class Maths Solutions Chapter 5 నిరూపక జ్యామితి Ex 5.2 3