AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Unit Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 12th Lesson దత్తాంశ నిర్వహణ Unit Exercise
ప్రశ్న 1.
ఒక పాఠశాలలోని 20 మంది విద్యార్థుల వయస్సులు దిగువ ఇవ్వబడ్డాయి.
13, 10, 11, 12, 10, 11, 11, 13, 12, 11, 10, 11, 12, 11, 13, 11, 10, 13, 10, 12
(i) ఈ దత్తాంశానికి గణన చిహ్నాలతో పౌనఃపున్య విభాజన పట్టికను నిర్మించండి.
(ii) ఏవయసు గల విద్యార్థులు ఎక్కువ మంది కలరు?
(iii) 10 సం|| వయస్సు గల విద్యార్థులెందరు?
(iv) గరిష్ఠ వయస్సు గల విద్యార్థుల సంఖ్య ఎంత?
సాధన.
పౌనఃపున్య విభాజన పట్టిక:
(i)

(ii) 11 సం|| వయస్సు గల విద్యార్థులు ఎక్కువ మంది కలరు.
(iii) 10 సం|| వయస్సు గల విద్యార్థుల సంఖ్య 5.
(iv) గరిష్ఠ వయస్సు (13 సం||) గల విద్యార్థుల సంఖ్య 4.
![]()
ప్రశ్న 2.
ఒక పాచికను 30 సార్లు దొర్లించగా వచ్చిన ఫలితాలు

(i) పై దత్తాంశమునకు పౌనఃపున్య విభాజన పట్టిక తయారు చేయండి.
(ii) ఎక్కువ సార్లు (గరిష్ఠంగా) వచ్చిన ఫలితము (సంఖ్య) ఏది?
(iii) 4 కంటే పెద్దదైన సంఖ్య ఎన్నిసార్లు ఫలితంగా వచ్చింది ?
(iv) బేసి సంఖ్య ఎన్నిసార్లు ఫలితంగా వచ్చింది?
సాధన.
(i) పౌనఃపున్య విభాజన పట్టిక:

(ii) ఎక్కువసార్లు (గరిష్ఠంగా) వచ్చిన ఫలితము (సంఖ్య) 2 మరియు 3.
(iii) 4 కంటే పెద్దదైన సంఖ్య 5 – 4 సార్లు, 6 – 5 సార్లు ఫలితంగా వచ్చినవి.
(iv) బేసి సంఖ్య
1 – 5 సార్లు
3 – 6 సార్లు
5 – 4 సార్లు వచ్చినది.
ప్రశ్న 3.
ఒక పాఠశాలలోని వివిధ తరగతులలో A గ్రేడు విద్యార్థుల శాతాలు ఈ విధంగా ఉన్నది.

పై దత్తాంశమును నిలువు కమ్మీ రేఖా చిత్రంలో చూపండి.
సాధన.
(i) VI వ తరగతి A గ్రేడు విద్యార్థులను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {65}{10}[/latex] = 6.5 సెం.మీ.
(ii) VII వ తరగతి A గ్రేడు విద్యార్థులను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {75}{10}[/latex] = 7.5 సెం.మీ.
(iii) VIII వ తరగతి A గ్రేడు విద్యార్థులను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {85}{10}[/latex] = 8.5 సెం.మీ.
(iv) IX వ తరగతి A గ్రేడు విద్యార్థులను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {60}{10}[/latex] = 6 సెం.మీ.
(v) Xవ తరగతి A గ్రేడు విద్యార్థులను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {80}{10}[/latex] = 8 సెం.మీ.

![]()
ప్రశ్న 4.
ఒక పుస్తక విక్రేత ఆరు రోజులలో అమ్మిన గణిత పుస్తకాల సంఖ్య కింద ఇవ్వబడింది.

ఈ దత్తాంశానికి అడ్డు కమ్మీ రేఖా చిత్రం నిర్మించండి.
సాధన.
సోమవారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {65}{10}[/latex] = 6.5 సెం.మీ.
మంగళవారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {40}{10}[/latex] = 4 సెం.మీ.
బుధవారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {30}{10}[/latex] = 3 సెం.మీ.
గురువారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {50}{10}[/latex] = 5 సెం.మీ.
శుక్రవారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {70}{10}[/latex] = 7 సెం.మీ.
శనివారంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {20}{10}[/latex] = 2 సెం.మీ.
